Tuesday, March 31, 2026
E-PAPER
Homeజాతీయంమావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్‌

మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్‌

- Advertisement -

అభివృద్ధి దిశగా ముందుకు
కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బస్తర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటించారు. సోమవారం లోక్‌సభలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల ఏరివేతకు మార్చి 31 డెడ్‌లైన్‌ అని తెలిపారు. బస్తర్‌లో ప్రస్తుతం మావోయిస్టులు లేరని, మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వెల్లడించారు. బస్తర్‌లో ఆదివాసీలకు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధి దిశగా బస్తర్‌ ప్రాంతం ముందుకెళ్తోందని తెలిపారు.

అలాగే మావోయిస్టుల లొంగుబాటుకు నేడు (మంగళవారం) చివరి తేదీ అని, అభివృద్ధి లేదంటూ ఆయుధాలు పట్టుకోవడం సరికాదని అమిత్‌షా హితవు పలికారు. కాంగ్రెస్‌ హయాంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, వారి పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. గిరిజనులను 60ఏండ్లపాటు కాంగ్రెస్‌ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే దేశంలో మావోయిస్టులు పెరిగారని, 12 రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆయన మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తమ వల్లే నక్సల్స్‌ విముక్త భారత్‌ సాధ్యమవుతోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -