Tuesday, March 31, 2026
E-PAPER
Homeఆటలుమియామీ టైటిల్‌ విజేత సిన్నర్‌

మియామీ టైటిల్‌ విజేత సిన్నర్‌

- Advertisement -

– ఫైనల్లో లెహెక్కాపై గెలుపు
– మియామీ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ

న్యూయార్క్‌: మియామీ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను 2వ సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌ చేజిక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో సిన్నర్‌ వరుససెట్లలో 21వ సీడ్‌, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన లెహెక్కాను ఓడించాడు. కేవలం రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన సిన్నర్‌ ప్రత్యర్ధిని 6-4, 6-4తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో సిన్నర్‌ 10 ఏస్‌లను సంధించడంతోపాటు మొదటి సర్వీస్‌ను 91శాతం నిలబెట్టుకొని విజయం సాధించాడు. ఇక మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అర్యానా సబలెంక టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్‌, బెలారస్‌కు చెందిన సబలెంక 6-2, 4-6, 6-3తో 4వ సీడ్‌, అమెరికాకు చెందిన కోకా గాఫ్‌ను ఓడించింది. ఇక మహిళల డబుల్స్‌ టైటిల్‌ను 2వ సీడ్‌ అమెరికా-చెక్‌ రిపబ్లిక్‌ జోడీ టాప్‌సీడ్‌ ఇటలీ జంటను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌లో టౌన్సెండ్‌(అమెరికా)-సినియాకోవా(చెక్‌) జంట 7-6(7-0), 6-1తో టాప్‌సీడ్‌ ఎరానీ-పౌలిని జంటను ఓడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -