నిబంధనల మేరకు నోటరీలను అనుమతిస్తాం
ఉద్యోగులు, సిబ్బందికి మరింత మెరుగైన వైద్యం : సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఫీడర్ల వారీగా లోడ్ డేటాను (ఏఐ) ద్వారా విశ్లేషించి, ప్రాంతాల వారీగా కచ్చితమైన అంచనాను రూపొందించడం జరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాలను, సంస్థాగత సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో పెంచేందుకు ఏఐ వినియోగం ఉపయోగపడుతుందని అన్నారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందకు ఎన్‌ప్యానల్డ్ అస్పత్రుల సంఖ్యను 71 నుంచి 260కి పెంచినట్టు తెలిపారు. ఫలితంగా 20,261 మంది ఉద్యోగులు, 8,229 పెన్షనర్లకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ప్రయివేట్ స్పాట్ బిల్లర్లకు 12 రోజుల అదనపు పని దినాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నెలా 11 నుంచి 25 వరకు వీరి సేవలను విద్యుత్ మీటర్ల మార్పు, రిపేర్లకు వినియోగిస్తామని తెలిపారు. కొత్త మీటర్ కనెక్షన్ల కోసం నిబంధనల మేరకు నోటరీలను అనుమతిస్తామని చెప్పారు. విద్యుత్ మీటర్ల కొరతను నివారించేందుకు సీఈల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇంకా టెండర్లు ఫైనల్ కాలేదన్నారు. త్వరలో వీటిని ఆమోదించి పనులు మొదలు పెడతామని చెప్పారు. రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 33 కేవీ ఫీడర్లు 57, 119 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 442 11 కేవీ ఫీడర్లు, 3,262 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను కొత్తగా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
ఎస్పీడీసీఎల్‌లో ఏఐ సేవలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



