షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మెన్, వైఎస్ చైర్మెన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 2న ఎన్నిక నిర్వహించడానికి కలెక్టర్‌చే నియమించబడ్డ సంబంధిత ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు విధిగా నోటీస్ ఇవ్వాలని ఆదేశించింది.
చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు వైఎస్ చైర్మెన్ ఎన్నిక నిర్వహించరాదని ఆదేశించింది. ఏదైనా కారణం చేత ఎన్నిక జరగక పోతే ఏప్రిల్ 5న (సెలవు దినమైనా) నిర్వహించాలని పేర్కొంది. ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో 2026 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగగా, ఫలితాలు 13న విడుదలయ్యాయి.. అయితే వివిధ కారణాల వల్ల ఈ మూడు మున్సిపాల్టీల్లో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 4న మూడు మున్సిపాల్టీల చైర్మెన్, వైస్ చైర్మెన్‌ల ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



