మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యమకారులను ఆదుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆకాంక్షను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఆరోపణలపై సీబీసీఐటీ విచారణ చేస్తున్నప్పటికీ పెద్దల సభలో పేపర్లు చించి చైర్మెన్‌పై వేయడం మంచి పరిణామం కాదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు. గిగ్ వర్కర్ మంచి పాలసీ అని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన దారుణంగా ఉందనీ, కేటీఆర్ దృష్టిలో పడాలని అలా చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వడం లేదనీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రమే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
ఉద్యమకారులను ఆదుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



