Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభం

ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణాలు సాగించే ప్రజల త్రాగునీటి తాపాన్ని తప్పించేందుకు, గ్రామ ప్రజల సౌకర్యార్థం ఈ చాలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి శేఖర్,కార్యదర్శి రాఘవేందర్, వార్డ్ సభ్యులు విభూది  అనిల్, బైరగోని  అజయ్, రాకేష్, అవారి సంతోష్, అవారి  సురేష్, అంజిత్, సీనియర్ నాయకులు సాదుల్లా, గ్రామపంచాయతీ కారోబార్ బాజే సాబ్, లైన్ మెన్ శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -