నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1 మైన్ 2025-26 సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరినట్లు బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్లు ప్రభాకర్ రెడ్డి,సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్ధ్యాన్ని 100 శాతం ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని విజయవంతంగా సాధించి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పినట్లుగా తెలిపారు.
ఏఎమ్మార్ కంపెనీ ఆధ్వర్యంలో బొగ్గు వెలికితీత పనులు చేపడుతున్న ఈ మైన్ లో 2025-26 సంవత్సరంలో 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని చేరుకున్న నేపథ్యంలో ఎమ్మార్ కంపెనీ ఎండి మహేష్ రెడ్డి కార్మికులను,అధికారులను,ఉద్యోగులను అభినందించినట్లుగా తెలిపారు. ఇదే సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ప్రమాదాల రహిత మైన్ గా బెస్ట్ సేఫ్టీ ప్రాక్టీస్ అవార్డుతో పాటు మైన్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించినట్లుగాపేర్కొన్నారు. ఓసిపిలో పనిచేస్తున్న ల్ కార్మికులు, అధికారులు, ఉద్యోగులకు ప్రభాకర్ రెడ్డి, మూర్తిలు అభినందనలు తెలిపారు.



