Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి

గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధి

- Advertisement -

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న..
నవతెలంగాణ – తుంగతుర్తి
గ్రామాల అభివృద్దే… దేశాభివృద్ధి… గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే… కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, స్థానిక సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలోని వడ్డెర కాలనీ నుండి ముదిరాజ్ పెద్దమ్మ గుడి వరకు రూ.10 లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు.

ఈ మేరకు ప్రజా ప్రభుత్వంలో గ్రామాలకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి సదుపాయం కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు కోతి ఉమ, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమన్న,పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -