Tuesday, March 31, 2026
E-PAPER
Homeఖమ్మంనేడు ఆరోగ్యవంతంగా ఉంటేనే నిజమైన ధనవంతుడు 

నేడు ఆరోగ్యవంతంగా ఉంటేనే నిజమైన ధనవంతుడు 

- Advertisement -

బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులు ప్రమాదకరం
రాష్ట్ర ప్రభుత్వం “పారాక్పాట్”గడ్డి మందును నిషేధించడం అభినందనీయం
శ్రీ రక్షా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు 
నవతెలంగాణ – బోనకల్ 

నేడు కోట్లాది రూపాయల ఉంటే ధనవంతులు కాదని ఆరోగ్యవంతంగా ఉండటమే నిజమైన ధనవంతులని ఖమ్మం కు చెందిన ప్రముఖ శ్రీరక్ష హాస్పిటల్ యజమాని ప్రముఖ డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరవల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శ్రీ రక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య యాత్ర నిర్వహించారు. తొలుత పెద్ద బీరవల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 90 మందికి బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా రోగులకు పంపిణీ చేశారు. అనంతరం పెద్ద బీరవల్లి గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఆరోగ్య యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు గోంగూర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు డబ్బు ఉంటే ధనవంతులని భావించారని కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నవారే నేడు ధనవంతులన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఈ నాలుగు రోగాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్య సమస్యల తలెత్తున వెంటనే శ్రీరక్ష ఆస్పత్రికి రావాలని అందుకు అవసరమైన వైద్య చకిత్స చేస్తామని తెలిపారు.అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అవి ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందన్నారు.

ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే పరాక్పాట్ గడ్డి మందును నిషేధించాలని శ్రీరక్ష హాస్పిటల్ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఆందోళనలు నిర్వహించామని, దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ గడ్డి మందును నిషేదించాలని ఆందోళనలు జరిగాయన్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి శాసనసభలో సోమవారం పారాక్పాట్ గడ్డి మందును నిషేధిస్తున్నట్లు తీర్మానం చేయటం అభినందనీయమన్నారు. దీంతో అనేక కుటుంబాలు బాగుపడే అవకాశం ఉందన్నారు. గతంలో కుటుంబంలో ఏదైనా వివాదం జరిగినప్పుడు కొంతమంది క్షణికావేశంతో ఈ మందు తాగే వారన్నారు. పారాక్పాట్ గడ్డి మందు తాగితే మరణం తప్ప ప్రాణంతో బతికే అవకాశం పూర్తిగా లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజలలో ఆరోగ్య పై చైతన్యం కలిగించేందుకే శ్రీ రక్షా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని పెద్ద బీరవల్లి గ్రామపంచాయతీ సద్వినియోగం చేసుకుంటుందన్నారు. శ్రీ రక్షా హాస్పిటల్ చేపట్టిన ఆరోగ్య యాత్ర మా గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ఆరోగ్యానికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. అనంతరం సర్పంచ్ చింతలచెరువు కోటేశ్వరరావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను శ్రీ రక్షా హాస్పిటల్ వైద్య బృందం ఘనంగా శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రక్ష హాస్పటల్ వైద్యులు షేక్ ఏడుకొండలు, సాత్విక్,  అఖిలేష్, అరుణ్ కుమార్, శ్రీధర్, శ్రీకాంత్, కమలాకర్, సనావర్, కిరణ్, సిబ్బంది ఆత్మకూరి నాగేశ్వరరావు, గజ్జల శ్రీనివాస్, మణికాంత్, యశ్వంత్, ల్యాబ్ టెక్నీషియన్లు కిరణ్, తరుణ్, వైద్య సిబ్బంది పద్మ, ఉప సర్పంచ్ పెద్దపోలు రామారావు, పిట్టల నరసింహారావు, కోనంగి నాగమణి, పిట్టల రామారావు, చట్టు లక్ష్మీనారాయణ, బల్లెపోగు భారతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -