- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి మొదటగా ఇందిరమ్మ గృహ పథకంలో ఇండ్లు మంజూరు చేశామని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండా అన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలను ముగ్గు పోసి ప్రారంభించామని జీపీ కార్యదర్శి భరద్వాజ్ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మిగిలిన లబ్దిదారులకు కూడా ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. గృహ నిర్మాణాలు చేపట్టడానికి ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా గ్రామం తరపున సర్పంచ్ గా బాధ్యతలు తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసే విధంగా సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, ఇందిరమ్మ గృహా నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



