నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఏఎస్ఐ గా నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గుంటుక యాకయ్య 37 సంవత్సరాల సేవలు ఎంతో గొప్పవని నెల్లికుదురు ఎస్సై చిరా రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహించిన గుంటుక యాకయ్య గారు, 37 సంవత్సరాల సేవ చేసి మంగళవారం పదవీ విరమణ పొందారు.ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు, పదవి విరమణ పొందిన గుంటుక యాకయ్య ని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆయన దీర్ఘకాల సేవలను అభినందిస్తూ, పోలీస్ శాఖకు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
యాకయ్య 1989లో సివిల్‌గా పోలీస్ శాఖలో చేరి, వరంగల్ జిల్లా ఆత్మకూరులో తన సేవలను ప్రారంభించారు. అనంతరం 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతులు పొందుతూ, నిజాయితీతో విధులు నిర్వహించారు. 2025లో సేవా పతకం అందుకున్నారు. యాకయ్య కి రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ అంబరీష్ యాకయ్యకి ఘనంగా శాలతో సత్కరించి జ్ఞాపకం అందించి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ అభినందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన ఏఎస్ఐ యాకయ్య మాట్లాడుతూ పోలీస్ శాఖ అంటే ప్రజలను రక్షించే శాఖ కాపాడుకునే శాఖ దేశం శాంతి భదత ను కాపాడే శాఖ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు పోలీసు సిబ్బంది రాము ,రవి ,యాకయ్య, రమ, కుమార్, కిరణ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.



