Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు 

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు 

- Advertisement -

చండూరు సిఐ ఆదిరెడ్డి 
నవతెలంగాణ – చండూరు

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని చండూరు సిఐ ఆదిరెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పట్టణంలో పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్  వద్ద వాహనదారులకు అవగాహన నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వాహన చోదకులకు జరీమన విధించారని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్రమాదాల నివారణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించవద్దని అన్నారు. సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితమైన డ్రైవింగ్ గురించి తగు జాగ్రత్తలు తెలిపారు. ఆయన వెంట ఎస్సై శివకుమార్ , పోలీస్ సిబ్బంది, వాహన చోదకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -