హీరో శర్వా, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబోలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, ఎపీక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనె 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు.
చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను ఈ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. కథ పరంగా ఈ సినిమా సూపర్‌గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది.
నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ గారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘శేషు’ సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్‌కి వాడాను. ఆ తర్వాత అదే బైక్‌ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి ‘మీరు చాలా రిస్క్‌తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ). ఇందులో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.
అభిలాష్ చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద, క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్న దర్శకుడు . నా క్యారెక్టర్‌కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని అభినందిస్తారు.
ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్, సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. కొడుకు శర్వా అద్భుతంగా చేశారు.
హాలీవుడ్ రేంజ్‌లో ‘బైకర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



