జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ మూవీని ఈనెల 3న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ,’జీ స్టూడియోతో, దివ్యతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మానస, మహేష్, యదు వంశీ వంటి వారిని ఇంట్రడ్యూస్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. రమేష్ మొదటి నుంచి మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అనుదీప్‌కి అద్భుతమైన మ్యూజిక్ టాలెంట్ ఉంది. రాజు విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. విజరు మాస్టర్‌ని సెట్లో చూస్తే మా నాన్నని చూసినట్టే అనిపిస్తుంది. అన్వర్ అలీ కేవలం ఎడిటర్‌గా కాకుండా అన్ని బాధ్యతల్ని చూసుకుంటారు. నాన్న వల్ల నాకెంతో మంది పరిచయమయ్యారు. అందులో గెటప్ శ్రీను ఒకరు. ఆయన నన్నెంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నయన్‌లో ఓ ప్రత్యేకత ఉంది. సంగీత్ షైనింగ్ స్టార్. ఈ చిత్ర విజయంలో సంగీత్‌కి సింహభాగం దక్కుతుంది. మేం నిజాయితీతో వంద శాతం కష్టపడి ఓ మంచి సినిమాని చేశాం. మా పింక్ ఎలిఫెంట్‌లో పని చేసిన ప్రతీ ఒక్కరికి సొంతిల్లు, కారు ఉండాలి. ఫ్యామిలీతో ట్రిప్స్‌కి వెళ్తుండాలి. అదే నా లక్ష్యం. 3న రాబోతోన్న ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు.
‘జనాలు సినిమాని చూసి వదిలేయకూడదు, ఇంటికి తీసుకెళ్లాలి, గుర్తు పెట్టుకోవాలి, వాళ్లు పెట్టే డబ్బులకి సరిపడేలా న్యాయం చేయాలని మానస తపన పడుతుంటారు. మేం ఓ మంచి సినిమాని తీశామని నమ్ముతున్నాం. ఆడియెన్స్ పెట్టే ప్రతీ పైసాకి వర్త్ అనిపించేలా మా చిత్రం ఉంటుంది’ అని సంగీత్ శోభన్ చెప్పారు.
నయన్ సారిక మాట్లాడుతూ,”రాకాస’ని ప్రతీ ఒక్కరూ ఎంజారు చేస్తారు. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. ‘నిహారిక మా లక్కీ ఛార్మ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో సిరీస్‌ను డైరెక్ట్ చేస్తే.. ఆ వెంటనే సినిమా డైరెక్షన్ ఛాన్స్ కూడా వస్తుంది. నా ‘బెంచ్ లైఫ్’ తరువాత నాకు ‘రాకాస’ అవకాశం వచ్చింది. నిహారిక గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. సంగీత్ శోభన్ నా బలం’ అని దర్శకురాలు మానస శర్మ చెప్పారు.
దర్శకుడు యదు వంశీ, గెటప్ శ్రీను, అనుదీప్ దేవ్, జీ స్టూడియోస్ కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దివ్య విజరు, మైత్రి శశి, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి, డీఓపీ రాజు ఎదురోలు, ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు వర్ధన్, వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ మురళీ మనోహర్, ఫైట్ మాస్టర్ విజరు, మహేష్ ఉప్పాల, కొరియోగ్రాఫర్ విజరు పోలకి, లిరిక్ రైటర్ రఘు రాం తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
‘రాకాస’.. ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



