Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విప్లవ 'కాగడా' ఫిడెల్ అలెజాండ్రో కాస్ట్రో రుజ్ 

విప్లవ ‘కాగడా’ ఫిడెల్ అలెజాండ్రో కాస్ట్రో రుజ్ 

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
– గంగారంలో కాస్ట్రో శత జయంతి వేడుక 
నవతెలంగాణ – సత్తుపల్లి

సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు, క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ అలెజాండ్రో కాస్ట్రో రుజ్ శత జయంతిని సత్తుపల్లి మండలం గంగారంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అక్కడి ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం  ఘనంగా  ఘనంగా నిర్వహించారు. ఫిడెల్ కాస్ట్రో చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1926 ఆగస్టు 13న జన్మించిన కాస్ట్రో, బాటిష్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి విప్లవ పోరాటాన్ని నడిపారన్నారు. 1959లో క్యూబా విప్లవం సాధించిన విజయం తర్వాత దేశంలో విప్లవాత్మక సామాజిక, ఆర్థిక మార్పులు తెచ్చారని కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో ఉచిత, విస్తృత సేవలు అందిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచారని తెలిపారు.

అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను తిప్పికొడుతూ క్యూబా సార్వభౌమత్వాన్ని కాపాడిన ధీరుడు కాస్ట్రో అని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ప్రపంచవ్యాప్త సామాజిక న్యాయ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. దోపిడీ, అసమానతలపై ప్రజల హక్కుల కోసం పోరాటాలను బలోపేతం చేయడమే కాస్ట్రోకు ఇచ్చే నిజమైన నివాళి అని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కువ్వారపు లక్ష్మకావూరి కావూరి వెంకటేశ్వరరావు, రత్తయ్య, రామారావు, జయరాజు, భాగ్యలక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -