Wednesday, April 1, 2026
E-PAPER
Homeఆటలుపాక్‌ క్రికెట్‌లో జరిమానా పర్వం

పాక్‌ క్రికెట్‌లో జరిమానా పర్వం

- Advertisement -

నషీమ్‌, షహీన్‌లకు జరిమానా
ఫకర్‌ జమానాపై నిషేధం వేటు

కరాచీ : పాకిస్తాన్‌ క్రికెట్‌లో జరిమానాల పర్వం నడుస్తోంది. ఇటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, అటు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రాంఛైజీ ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లపై క్రమశిక్షణ కొరఢా ఝులిపించాయి. నషీమ్‌ షా, షహీన్‌ షా అఫ్రిదిలకు భారీ జరిమానా విధించగా.. ఫకర్‌ జమాన్‌పై 2 మ్యాచ్‌ల నిషేధం వేటు పడింది. పీఎస్‌ఎస్‌ మ్యాచ్‌కు హాజరైన పంజాబ్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ నవాజ్‌ (మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె)పై సోషల్‌ మీడియాలో విమర్శనాత్మక పోస్టు చేసిన నషీమ్‌ షాపై రూ.67.47 లక్షల జరిమానా పడింది. క్రమశిక్షణ సంఘం నోటీసుకు నషీమ్‌ సమాధానం ఇచ్చినా.. వార్షిక కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కింద భారీ జరిమానా విధించారు. ఇదిలా ఉండగా, పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తూ స్నేహితులను హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లిన షహీన్‌ షా అఫ్రిది, సికందర్‌ రజాపై పోలీసులు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. లాహోర్‌ క్వాలాండర్స్‌ సికందర్‌ రజాను వదిలేసి.. అఫ్రిదిపై రూ.3.37 లక్షల జరిమానా విధించింది. మరో ఆటగాడు ఫకర్‌ జమాన్‌ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ పట్టుబడగా.. అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఇంధన కొరతతో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -