కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత
కుమారుడికి హోంగార్డు ఉద్యోగ నియామకపత్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ట్యాంక్‌బండ్ శివకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి శివ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అతని కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ట్యాంక్‌బండ్ ప్రాంతంలో స్విమ్మింగ్ ఫూల్ నిర్మించి శివకు ఇవ్వాలనీ, అతని కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ట్యాంక్‌బండ్ శివ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నదనే విషయం సీఎం దృష్టికి వెళ్లింది. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ ఈ స్థితిలో ఉన్న విషయంపై సీఎం చలించిపోయారు. ట్యాంక్ బండ్ శివకు అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించారు. తాజాగా శివ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించారు. సీఎం చేతులమీదుగా సాయం అందుకోవడం ఆనందంగా ఉందని ట్యాంక్ బండ్ శివ, అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ట్యాంక్‌బండ్ శివకు సీఎం ఆపన్నహస్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



