నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఎస్‌ఐ అనిల్ రెడ్డి పరామర్శించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం వివిధ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ఎంతో ముఖ్యమని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎస్ఐ పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



