నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గురువారం ఆదర్శ మిత్ర సొసైటీ ఆధ్వర్యంలో కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములకు మంచి నీరు, పండ్లను పంపిణీ చేశారు. మేరకు ఆదర్శ మిత్ర సొసైటీ సభ్యులు మండల కేంద్ర శివారులో వివిధ ప్రాంతాల నుండి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు తమ వంతు సేవగా మంచినీటి వాటర్ బాటిల్ లను, అరటి పండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆదర్శ మిత్ర సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఎంతో వ్యాయ ప్రయాసలకు ఓర్చి కాలినడకన అంజన్న మాలధారణ స్వాములు కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లడం, వారికి తమ వంతుగా సేవ చేసుకునే భాగ్యం కలగడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రతిరోజు తమకు తోచినంతగా స్వాములకు మంచినీటి వాటర్ బాటిల్ తో పాటు వివిధ రకాల పండ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ మిత్ర సొసైటీ సభ్యులు మల్యాల సుభాష్ గౌడ్, సున్నం మోహన్, గుజ్జేటి రవీందర్, సాంబార్ అశోక్, లక్ష్మణ్ గౌడ్, రేంజర్ల మహేందర్, నూకల బుచ్చి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



