Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫ్రీ స్కూల్ విద్యార్థులకు దుస్తులు పంపిణీ 

ఫ్రీ స్కూల్ విద్యార్థులకు దుస్తులు పంపిణీ 

- Advertisement -

మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ విద్యార్థులకు ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ, ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి ల తో కలిసి దుస్తులను అందించినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. బుధవారం అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న ఫ్రీ స్కూల్ విద్యార్థులు సక్రమంగా రోజు పాఠశాలకు వచ్చి టీచర్లు చెప్పే వాటిని విని మంచి చదువుకోవాలని అంగన్వాడీ టీచర్లు పిల్లలను సక్రమంగా చూసుకోవాలని అన్నారు. అవసరమైతే ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వారి అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -