– సుమారు 600 మంది విద్యార్థులకు భోజనాలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం 4వ తరగతి విద్యార్థిని గాండ్ల వైశాలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బెజ్జారపు రాకేష్, పాలకవర్గం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం సమక్షంలో వైశాలి పుట్టినరోజులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని వైశాలి చేత కేకును కట్ చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విద్యార్థిని వైశాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులకు పలు రకాల వంటలతో కూడిన భోజనాన్ని అందించారు. కాగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తమ వంతుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా విద్యార్థిని వైశాలి తల్లిదండ్రులు గాండ్ల శ్రీనివాస్ దివ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఉప సర్పంచ్ భలే రావు శంకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సామా బాపురెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మేల చిన్న గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షులు శెట్టిపల్లి గంగాధర్, పాఠశాలల ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.



