Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

– సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్..
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ అన్నారు.బుధవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో ప్రజాపాలన… ప్రగతి ప్రణాళిక పై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన,99 రోజుల కార్యాచరణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు.గ్రామ,వార్డు సభలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత,గంజాయి,డ్రగ్స్ నిర్మూలన ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 99 రోజులో సర్పంచి నుంచి ఎమ్మెల్యే,ఎంపీ వరకు ప్రజాప్రతినిధుల,అందరిని భాగస్వామ్యం చేసి మండల పట్టణ నియోజకవర్గ కేంద్రాలలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి,ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న,సాంస్కృతిక సారథి  జిల్లా టీం లీడర్ పల్లెల లక్ష్మణ్,జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెల రాము,గంట బిక్షపతి,గడ్డం ఉదయ్,పాక ఉపేందర్,మాగి శంకర్,మద్దిరాల మంజుల,కుందమల్ల నాగలక్ష్మి,మల్లమ్మ,సిరిపంగి రాధ,గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -