Wednesday, April 1, 2026
E-PAPER
Homeఖమ్మంఆశాజనకంగా ఆయిల్ ఫామ్ గెలలు ధర

ఆశాజనకంగా ఆయిల్ ఫామ్ గెలలు ధర

- Advertisement -

– నాలుగేళ్ల తర్వాత మళ్లీ రూ.23 వేల మార్క్ దాటిన ధర
– రైతుల్లో ఆనందం
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఫామ్ ఆయిల్ గెలల ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా పెరుగుతూ రైతులకు ఊరటనిస్తున్నాయి.గత సంవత్సరం (2025)లో టన్ను గెలల ధర రూ.19 వేలకే పరిమితమవగా, 2026 సంవత్సరంలో మాత్రం నెల నెలా ధరలు పెరుగుతున్నాయి.దీంతో పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆయిల్ ఫెడ్ పాలకమండలి మార్చి నెలకు గాను టన్ను గెలల ధరను రూ.23,005గా ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో ఉన్న రూ.21,546తో పోలిస్తే టన్నుకు రూ.1,459 పెరుగుదల నమోదైంది.

ఆయిల్ ఫాం గెలలు ధర చరిత్ర లో గరిష్టంగా 2022 జూన్ నెలలో టన్ను గెలలు ధర రూ.23,467 లుగా నమోదైంది. ఆ తర్వాత నాలుగేళ్ల అనంతరం మళ్లీ రూ.23 వేల మార్క్ చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నెలవారీ గెలల ధరలు

నెల                టన్ను ధర (రూ.)        పెరుగుదల (రూ.)

డిసెంబర్ (2025)19,694 

జనవరి (2026)   20,456                     762

ఫిబ్రవరి (2026)   21,546                   1,090

మార్చి (2026)     23,005                   1,459

ధరల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన ధరలు లభిస్తే మరింత మంది రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ధరల పెరుగుదలతో రైతులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -