- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో సెన్సెస్ కార్యక్రమం ముమ్మ రంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా జుక్కల్ గ్రామం లో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మరియు హంగర్గా కార్యదర్శి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సెన్సెస్ కార్యక్రమం గ్రామాలలో కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని, అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మరియు హంగర్గా గ్రామ కార్యదర్శులు గ్రామపంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



