బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య..
నవతెలంగాణ – తుంగతుర్తి
ఏప్రిల్ నెల మొత్తం ఎస్సారెస్పీ నీటిని నిరంతరాయంగా పూర్తిస్థాయిలో విడుదల చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ దయానందంకు బిఆర్ఎస్ బృందం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈనెల మూడో తేదీ వరకు చివరి విడత నీటి విడుదల పూర్తి అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడంతో,తుంగతుర్తి మండలంలో 2000 ఎకరాల వరి పంట ఎండిపోతుందని,వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఏప్రిల్ చివరి వరకు నీటి విడుదల చేయాలని కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వారబంది విధానంలో నీరు సరఫరా చేయడం వల్ల ఇప్పటికే వరి పొలాలు నాటిన చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
మిగిలిన రైతులకు కనీసం ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా నీరు అందిస్తే,రైతులు తమ పంటను కోయగల పరిస్థితి ఉంటుందని అన్నారు.అయితే అధికారులు,ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.చివరి భూముల వరకు నీటిని అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాములు గౌడ్,మండల నాయకులు తునికి సాయిలు,గోపగాని రమేష్ గౌడ్,తడకమళ్ళ రవికుమార్,సోమనర్సయ్య,వెంకటయ్య, వెంకటేష్,సాయికిరణ్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



