పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగ రాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈనెల 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి మీడియాతో సంభాషించారు. ‘నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ‘ఆనంద్, గోదావరి’ మూవీస్ చూశా. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల గారి ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం.
చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. సముద్రఖని తన పాత్రలోని ప్రతి షేడ్‌ను అద్భుతంగా పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది. మ్యూజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం . ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు. మా డీఓపీ యువరాజ్ దక్షణ్, ఎడిటర్ జగన్‌లకు ఎంతో అనుభవం ఉంది. మా ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులుకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
అప్పుల్లో ఉన్న వారికి ధైర్యాన్నిచ్చే చిత్రం
- Advertisement -
- Advertisement -



