Thursday, April 2, 2026
E-PAPER
Homeసినిమాఅందరూ కనెక్ట్‌ అవుతారు

అందరూ కనెక్ట్‌ అవుతారు

- Advertisement -

హీరో శర్వా నంద్‌ నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘బైకర్‌’. రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ పాత్రని పోషించారు. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్‌ మోటోక్రాస్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ఈనెల 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ మాళవిక నాయర్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ కథ చాలా నచ్చింది. దర్శకుడు అభిలాష్‌ చాలా ఫ్రెష్‌ కంటెంట్‌ ఉన్న క్యారెక్టర్‌ రాశారు. ఇది హై అడ్రినలిన్‌, హై ఆక్టేన్‌ ఫిల్మ్‌. మ్యూజిక్‌ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్‌ గురించి ఇప్పుడే ఎక్కువగా రివీల్‌ చేయకూడదు. ఎందుకంటే నా పాత్ర కథకు బ్రిడ్జ్‌లా ఉంటుంది.

ఒక స్పోర్ట్స్‌మన్‌ జీవితంలో ఫ్యామిలీ రోల్‌ చాలా కీలకం. కథ మూడు టైమ్‌ లైన్స్‌లో సాగుతుంది. నా పాత్ర కూడా ఇవాల్వ్‌ అవుతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉన్న మంచి ఇంపాక్ట్‌ఫుల్‌ రోల్‌ చేశాను. శర్వా చాలా స్పాంటేనియస్‌గా ఉంటారు. మ్యూజిక్‌ టెక్నికల్‌గా మంచి హై ఇస్తుంది. అలాగే ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. ఫాదర్‌-సన్‌ ఎమోషన్‌ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు మంచి ఆర్క్‌ ఉంటుంది. ఇందులో ‘ప్రెట్టీ బేబీ’ సాంగ్‌ ఉంది. శేఖర్‌ మాస్టర్‌ చాలా బ్యూటీ ఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రాజశేఖర్‌తో కలిసి నటించడం మంచి అనుభవం. డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డి చాలా క్లారిటీతో ఉండే డైరెక్టర్‌. ఈ సినిమా మంచి స్పూర్తిని ఇస్తుంది. యంగ్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -