హీరో టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లిచట్టంబి’. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మించారు.
డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో బుధవారం హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ మీడియాతో ముచ్చటించారు.
హీరో టొవినో థామస్ మాట్లాడుతూ,’డిజో ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఈ కథ ప్రకారం హీరో బలంగా కనిపించాలి. విలన్స్‌ను విసిరిపారేసేలా ఉండాలి. అందుకే వెయిట్ పెరిగాను. అప్పటిదాకా డైటింగ్ చేసే నేను ఈ చిత్రం కోసం డైటింగ్ పక్కనపెట్టాను. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్‌లోకి మారాను. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్‌కు డిస్కషన్స్ జరిగాయి. కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. మలయాళంలో నేను స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాను. అక్కడ సినిమాలు వదిలి మరో భాషకు వస్తే నన్ను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారు. నిర్మాతలు నౌఫల్, బ్రిజేష్‌తో గతంలో వర్క్ చేశాను. వాళ్లు నా మూవీస్‌ను డిస్ట్రిబ్యూట్ చేసేవారు. తెలుగు నుంచి ప్రొడ్యూసర్స్ చైతన్య, చాణక్య, చరణ్ వచ్చి మా మూవీ చేయడం హ్యాపీగా అనిపించింది. జేక్స్ బిజోరు తన మ్యూజిక్‌తో మా మూవీలోని ఇంటెన్సిటీని, ఎఫెక్ట్‌ను మరింతగా పెంచారు. ఈ సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్‌గా సాగే మూవీ. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించాం. ఈ మూవీలో మానవత్వం ముఖ్యమనే పాయింట్‌ను చూపిస్తున్నాం. ఇదొక బ్యూటీఫుల్ ఎమోషనల్ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’ అని తెలిపారు.
”డ్రాగన్’ మూవీ కంటే ఓకే అయిన చిత్రమిది. ఈ కథ విన్నాక నా కెరీర్లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని అనిపించింది. ఈ చిత్రంలో రెబెకా అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని హీరోయిన్ కయదు లోహర్ చెప్పారు.
మానవత్వం ముఖ్యమని చెప్పే సినిమా
- Advertisement -
- Advertisement -



