Saturday, August 15, 2026
E-PAPER
Homeజాతీయంస్కూల్‌ టీక్‌ కరో: సీజేపీ

స్కూల్‌ టీక్‌ కరో: సీజేపీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ‘స్కూల్‌ టీక్‌ కరో’ (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని హింగోలిలోని తన స్వగ్రామమైన సంతుక్‌ పింప్రిలో ఈప్రచారాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. తన గ్రామానికి బయలుదేరే ముందు, శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏపార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను, ప్రమాణాలను మెరుగుపరచడంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం విద్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అధికారంలో ఉన్న ఏపార్టీ కూడా పాఠశాలల అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో శుక్రవారం నిర్వహించిన ‘తిరంగా ర్యాలీ’ సందర్భంగా అక్కడ వెలిసిన భారీ బ్యానర్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని దీప్కే ప్రశ్నించారు. తిరంగా ర్యాలీ నిర్వహించడం మంచిదేనని, కానీ ప్రతి 40-50 అడుగులకు ఒక భారీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారని, వాటన్నింటికీ నిధులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సోమవారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టనున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయా లేదా అని తల్లిదండ్రులకు సూచించారు. విద్యాసంస్థలను మెరుగుపరిచే బాధ్యతను సర్పంచులు చేపట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -