Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి. సాగర్, రాష్ట్ర నాయకులు జి. నాగయ్యతో పాటు ప్రజా సంఘాల నాయకులు, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -