- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్: స్నాతకోత్సవానికి సీజేఐ రాకను నిరసిస్తూ నల్సార్ యూనివర్సిటీ అధికారులకు విద్యార్థులు లేఖ అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. అయితే బార్ కౌన్సిల్ విద్యార్థుల చర్యలను ఖండిస్తూ వారిపై కఠిన చర్యలకు యత్నించింది. బార్ కౌన్సిల్ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. అంతేకాకుండా తనకు, విద్యార్థులకు మధ్య బార్ కౌన్సిల్ జోక్యం అనవసరమని సీజేఐ సూర్యకాంత్ కూడా స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నల్సార్ లా విద్యార్థులకు తన సెల్యూట్ అని కొనియాడారు.
“ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవంపై, పోరాటలను అవమానిస్తే దేశ యువత తప్పక స్పందిస్తుందని నల్సార్ (NALSAR) విద్యార్థులు దేశంలోని ప్రముఖ నాయకులందరికీ స్పష్టంగా తెలియజేశారు. నేడు దృఢమైన వైఖరిని ప్రదర్శించిన ఆ యువతకు నేను సెల్యూట్ చేస్తున్నాను. అలాగే, ఈ విషయం న్యాయవ్యవస్థకు, విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధానికి సంబంధించినదని గుర్తించి, స్వయంగా స్పందించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అని మీడియా సమావేశంలో కేటీఆర్ అన్నారు.



