Saturday, August 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకరెంట్‌ షాక్‌తో టీచర్ మృతి..

కరెంట్‌ షాక్‌తో టీచర్ మృతి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఒక ప్రయివేటు పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో భాగంగా జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పోల్‌ను అమర్చుతుండగా విద్యుత్ వైర్ తగిలింది. దీంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రియబ్రత బెహెరా విద్యుదాఘాతంతో మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, టీచర్ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -