- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్(100*) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) రనౌటయ్యాక క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సెంచరీతో కదం తొక్కాడు. లంచ్ అనంతరం జోరు పెంచిన అతడు.. టీ సెషన్ తర్వాత లహిరు కుమార ఓవర్లో వరసగా రెండు ఫోర్లతో 90లోకి వచ్చాడు. అనంతరం నువాంత ఓవర్లో సింగిల్ తీసి.. సుదీర్ఘ ఫార్మాట్‌లో మొట్టమొదటి శతకం సాధించాడు. పడిక్కల్‌ను కోచ్ గౌతం గంభీర్, సహచరులు అభినందించారు.
- Advertisement -



