ముంబయి : మూడేండ్ల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం తిరిగి భారత్‌కు రానుంది. గత మూడు సార్లు వరుసగా దుబాయ్, అబుదాబి, జెడ్డాలో నిర్వహించగా.. 2027 ఐపీఎల్ మినీ వేలం గోవాలో జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. ‘మూడు సీజన్లు సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబిలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నిర్వహించాం. ఈ ఏడాది గోవాలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని’ సైకియా తెలిపారు. 2028లో ఐపీఎల్ మెగా వేలం జరుగనుండగా.. 2023-27 సైకిల్‌లో ఇదే ఆఖరు మినీ వేలం కానుంది. 2027 ఐపీఎల్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరుగనుండగా.. డిసెంబర్‌లో ఆటగాళ్ల వేలం షెడ్యూల్ చేశారు. నవంబర్ ఆఖరు వరకు ప్రాంఛైజీలు రిటెన్షన్ జాబితా విడుదల చేసేందుకు గడువు ఇవ్వనున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2025, 2026 సీజన్లలో చాంపియన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
గోవాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



