- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా క్రీడల్లో మహిళల షాట్ పుట్ విభాగంలో భారత్‌కు చెందిన మన్‌ప్రీత్ కౌర్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మన్‌ప్రీత్ తన నాల్గో ప్రయత్నంలో 17.17 మీటర్ల అత్యుత్తమ దూరాన్ని నమోదు చేసి పతకాన్ని ఖరారు చేసుకున్నారు. చైనాకు చెందిన సాంగ్ జియాయువాన్ 19.40 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణాన్ని, అదే దేశానికి చెందిన జాంగ్ లిన్రు 18.14 మీటర్లతో రజతాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే ఈవెంట్లో మరో భారత క్రీడాకారిణి కృష్ణ జయశంకర్ మీనన్ ఐదవ స్థానంలో నిలిచారు.
- Advertisement -



