- Advertisement -
- పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు
నవతెలంగాణ-హైదరాబాద్: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈక్రమంలో శుక్రవారం పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, చండీగఢ్, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికల సంఘం కార్యాలయాల వైపు కవాతు చేస్తూ, సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాల పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.



- Advertisement -



