నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీనగర్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్ముకశ్మీర్ సీఎం ఓమర్ అబ్దులా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రం తొలగించి ఉండకపోతే, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజలు జమ్మూ-కశ్మీర్‌లో విలీనం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారని ఒమర్ అబ్దుల్లా శనివారం అన్నారు. గత కొద్ది రోజులుగా పీఓకేలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్న అనేక మందిని చంపేశారని, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, లక్షల మందిని చరసాలల్లో బంధించారు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించడానికి, అలాగే జమ్మూ కాశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలను సాకారం చేసే దిశగా మేము కృషి చేస్తాము,” అని అబ్దుల్లా తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. సీఎం హోదాలో ఉండి ఓమర్ అబ్దుల్లా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడింది. పీఓకే ప్రజలను భారత్ లో విలీనం కావాలని పిలుపునివ్వడం సరైన పద్దతి కాదని విమర్శలు గుప్పించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వ్యాఖ్యలు తగదని, ఈ విషయాన్ని రాజకీయం చేయడం సమంజసం కాదని హితువు పలికింది.



