Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడు మర్చిపోవద్దు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడు మర్చిపోవద్దు

- Advertisement -

– రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి :  ప్రజలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడు మర్చిపోవద్దనీ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ నలిమెల  రేవతి గంగారెడ్డి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు భరోసా, విదేశాలలో చనిపోయిన వారికి ఐదు లక్షల పథకం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ లాంటి మరెన్నో పథకాలు ప్రజలకు అందిస్తుందన్నారు. ఇన్ని పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నడు మర్చిపోవద్దని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ గ్రామ సభలో ప్రత్యేక అధికారి, తహసిల్దార్ గుడిమేల  ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పాలన అధికారి శ్రీకాంత్, ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఏఎన్ఎం మమత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకెపి సీసీ అలేఖ్య, లైన్మెన్ అశోక్, అన్ని శాఖల అధికారులు, మహిళా సంఘ సభ్యులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -