Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి సుజయ్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -