Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్యం దిశగా చదవండి.. ఆత్మవిశ్వాసంతో గెలవండి: సిద్దిపేట సీపీ

లక్ష్యం దిశగా చదవండి.. ఆత్మవిశ్వాసంతో గెలవండి: సిద్దిపేట సీపీ

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు :  విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. గురువారం పెద్ద కోడూరులోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరినప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు నిజమైన గౌరవం దక్కుతుందన్నారు.  సమాజంలోని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి మార్గంలో నడవాలని సూచించారు.  ప్రయాణాల్లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని, నెట్‌వర్క్ లేని పక్షంలో అప్రమత్తంగా వ్యవహరించి సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.  ప్రతి మహిళ ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలచుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫోన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటికి దూరంగా ఉంటే మన భవితకు బంగారు బాటలు వేసుకోవచ్చన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించారు.  ఈ కార్యక్రమానికి గ్రామ ప్రదమ పౌరుడైన సర్పంచు, మండల విద్యదికారిని ఆహ్వానించకపోవడంపై  పలువురు మాట్లాడుకోవడం గమనర్హం ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత, రూరల్ సీఐ సీను, ఎస్సై చంద్రమోహన్, కళాశాల ఇంచార్జ్ ఎల్లారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -