Thursday, April 2, 2026
E-PAPER
Homeఖమ్మంఈ నెల 6న ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా 

ఈ నెల 6న ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా 

- Advertisement -

– భూ సమస్యలు మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి 
– ప్రభుత్వం అప్పటికి కళ్ళు తెరవకపోతే కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష
– మొక్కజొన్న కొనుగోలు పై పరిమితిని వెంటనే ఎత్తివేయాలి 
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు 
నవతెలంగాణ – బోనకల్ 
: భూ సమస్యల పరిష్కరించాలని, వెంటనే మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కమిటీ సమావేశం ఆ సంఘం అధ్యక్షులు దివ్వెల వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 1.85 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా 73 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు.

అదేవిధంగా అనేక వేల ఎకరాలలో వరి పంటను సాగు చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చిందన్నారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు ప్రైవేట్ వ్యాపారులకం గత్యంతరం లేక అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.2400 రూపాయల ప్రకటించిదని, కానీ మధిర నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రూ. 1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. దీనివలన రైతు క్వింటాకు ఎనిమిది వందల రూపాయలు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం పరిమితి విధించటం సరైంది కాదన్నారు. రైతు వద్ద ఉన్న మొక్కజొన్న మొత్తం ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒక్కొక్క రైతు నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని విధించిన పరిమితిని వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఎకరం నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుందని, మిగిలిన పంట రైతులు ఎవరికి అమ్ముకోవాలని ఆయన ప్రశ్నించారు.గత సంవత్సరం భూ సమస్యల పరిష్కారం అంటూ పైలట్ ప్రాజెక్టు కింద బోనకల్లు మండలాన్ని ఎంపిక చేసి అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించారన్నారు. కానీ నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదన్నారు. భూ సమస్యల పరిష్కారం చేయకుండా రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. ఏప్రిల్ 7 న సాగర్ నీటిని బంద్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందని, కానీ ఏప్రిల్ చివరి వరకు సాగర్ నీటిని సరఫరా చేయాలని కోరారు. అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కోరారు.

జిల్లాలో ప్రధానంగా బోనకల్, చింతకాని, కొనిజర్ల మండలాలలో పెద్ద సంఖ్యలో మొక్కజొన్న కొనుగోలు చేశారని, ఈ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు. రైతు సమస్యల పరిష్కారం కోసం దసలవారీగా రిలే, ధర్నాలు నిర్వహిస్తామని అయినా ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహారదీక్షకు కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి చట్టం తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ నేటి వరకు దాని అమలు ఊసే లేదన్నారు. సాదా బైనామా లో వచ్చిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనియెడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో బాధిత రైతులతో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు మడిపల్లి గోపాలరావు, కిలారి సురేష్, జోనిబోయిన గురవయ్య, దొండపాటి సత్యనారాయణ, తోటకూర వెంకట నరసయ్య, ఎర్రగాని నాగరాజు, గుడ్డురి ఉమ, ఎండ్రపల్లి రవికుమార్, గుడ్డురి వెంకట నరసయ్య, మడిపల్లి కిరణ్ బాబు, పులి యజ్ఞ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -