Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మైనర్ డ్రైవింగ్ లో 36 మంది పట్టివేత

మైనర్ డ్రైవింగ్ లో 36 మంది పట్టివేత

- Advertisement -

వారితోనే వినూత్న ప్రచారం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై సీపీ సాయి చైతన్య  ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడిపితే కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా మైనర్ డ్రైవింగ్ చేస్తూ 36 మంది పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సీపీ ఆదేశాల మేరకు వారితో నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్లకార్డులతో ప్రచారం చేయించారు. మైనర్ డ్రైవింగ్ చేయవద్దంటూ ఫ్లకార్డులు పట్టుకుని నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నిలబడ్డారు. వేగం మోజులో పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని సూచిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిజామాబాద్ నగర ప్రజల సైతం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇలాంటి చర్యలపై అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాగైనా మైనర్ డ్రైవింగ్ కట్టడి చేయగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad