నవతెలంగాణ-మర్రిగూడ : మండల కేంద్రంలో గురువారం మండల పరిసర ప్రాంత ప్రజల వ్యాపార అవసరాల నిమిత్తం గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష-లోకేష్ గౌడ్ పశువుల అంగడి(సంతను) కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మర్రిగూడ గ్రామానికి పూర్వ వైభవం తెచ్చి,గ్రామపంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అంగడిని ప్రారంభించమని తెలిపారు.గ్రామ ప్రజలతో పాటు,మండల పరిసర ప్రాంతాల ప్రజలు తమ వ్యాపార కార్యక్రమాల నిమిత్తం అంగడిని సద్వినియోగం చేసుకొని,అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్ గౌడ్,గ్రామ ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్,వార్డ్ సభ్యులు యండి జమీర్,మహేశ్వరం యాదమ్మ రమేష్,జర్పుల హనుమంతు,నల్ల శేఖర్ గౌడ్,గ్యార వెంకటమ్మ యదయ్య,తిరుమని అంజమ్మ,చెరుకు శ్రీరామ్ గౌడ్,సత్తయ్య,అంజయ్య నగేష్,రాజేందర్ రెడ్డి,రవి,శ్రీరాములు,శ్రీకాంత్,గణేష్,తదితరులు పాల్గొన్నారు.
పశువుల అంగడి(సంత) ను ప్రారంభించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



