Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతాజా వార్తలుపోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని …. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్రంలోని పోలీసు శాఖలో విశిష్ట సేవలందించిన అధికారులను గుర్తించి ప్రభుత్వం గౌరవించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 25 మంది పోలీసు సిబ్బందికి పతకాలు లభించాయి. వీరిలో 9 మంది శౌర్య పతకం ను పొందగా, 16 మంది మహోన్నత సేవా పతకానికి అర్హులయ్యారు. శౌర్య పతకాన్ని అందుకున్నవారు తమ విధుల్లో అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించి ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టినవారుగా గుర్తింపు పొందారు. మహోన్నత సేవా పతకాన్ని అందుకున్న అధికారులు సుదీర్ఘ కాలంగా నిజాయితీ, నిబద్ధతతో సేవలందించారని పోలీసు శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులకు ఈ సేవా పతకాలు ప్రదానం చేయడం పరంపరగా వస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad