జులైలో మూడు టీ20ల సిరీస్
న్యూఢిల్లీ : 2002 తర్వాత తొలిసారి వచ్చే ఏడాది ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్‌కు రానున్న జింబాబ్వే…అంతకముందే స్వదేశంలో భారత్‌తో సిరీస్‌కు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జులై 23, 25, 26న హరారె స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయని జింబాబ్వే క్రికెట్ వెల్లడించింది. 2027 జనవరిలో భారత పర్యటనకు రానున్న జింబాబ్వే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పోటీపడనున్న సంగతి తెలిసిందే. ‘భారత జట్టు పర్యటన జింబాబ్వే క్రికెట్‌కు ఓ మైలురాయి. భారత్‌తో మ్యాచ్‌లు ఎల్లప్పుడూ గొప్ప ఆసక్తిని రేకేత్తిస్తాయి. సొంత గడ్డపై ప్రపంచ చాంపియన్‌తో తలపడే అవకాశం జింబాబ్వే క్రికెటర్లకు లభించింది. ఈ సిరీస్‌తో జింబాబ్వే క్రికెట్ మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నామని’ జింబాబ్బే క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ మకోని తెలిపారు.



