అదానీ గ్రూప్, ఐడబ్ల్యూఐల సంయుక్త సంస్థల మధ్య డీల్ కోసమే మోడీ టూర్ ?
‘మేక్ ఇన్ ఇండియా’ పేరిట సాంకేతికత బదిలీ
41వేల తుపాకులకు కుదిరిన భారీ ఒప్పందం
న్యూఢిల్లీ : భారత్- ఇజ్రాయిల్ రక్షణ ఒప్పందాలు సజావుగా సాగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఇజ్రాయిల్‌కు చెందిన ఒక ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ తేలికపాటి మెషిన్ గన్ (ఎల్‌ఎంజీ )లను భారత్‌కు సరఫరా చేసింది. భారత్, ఇజ్రాయిల్ మధ్య 41వేల తుపాకులకు సంబంధించి భారీ ఒప్పందం కుదిరింది. అయితే తొలివిడతలో భాగంగా గత వారాంతంలో 2వేల చీజు+జుV 7.62ఞ51 ఎల్‌ఎంజీ ఆయుధాలను భారత్‌కు అందించింది. అదనంగా మరో 4,000 యూనిట్లను ఈ ఏడాది చివరలో అందించనున్నట్టు ఇజ్రాయిల్ వెపన్స్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
పీఎల్ ఆర్ సిస్టమ్స్ ద్వారా సరఫరా
ఈ ఆయుధాలను అదానీ గ్రూప్, ఐడబ్ల్యూఐల సంయుక్త సంస్థ అయిన పీఎల్ ఆర్ సిస్టమ్స్ ద్వారా ఈ సరఫరా జరిగింది. ఇవి భారత్‌లో ప్రయివేట్ రంగంలో చిన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తయారుచేస్తున్న తొలి సంస్థగా పీఎల్‌ఆర్ సిస్టమ్స్ గుర్తింపు పొందింది. టెక్నాలజీ బదిలీ ప్రక్రియ విజయవంతంగా పూర్తవడంతో, దేశీయంగా తయారీ చేపట్టడం సాధ్యమైందని సంస్థ పేర్కొంది.
ఎల్‌ఎంజీ ప్రత్యేకత ఏంటంటే!
నెగెవ్ 7.62 ఎల్‌ఎంజీ అత్యంత తేలికైన మెషీన్ గన్స్‌లో ఒకటి. కఠిన పరిస్థితుల్లో కూడా అత్యంత కచ్చితత్వంతో పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఈ ఆయుధాన్ని ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం వీటికి ఉంది. ఈ ఎల్‌ఎంజీకి సెమీ-ఆటోమేటిక్, ఫుల్-ఆటోమేటిక్ అనే రెండు రకాల విధానాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి భూమిపై మాత్రమే కాకుండా హెలికాప్టర్లు, వాహనాలు, నౌకలపై కూడా అమర్చే సౌకర్యం కల్పించారు.
కచ్చితమైన లక్ష్యంతో టార్గెట్ ఛేదన!
ఇది సైనిక చర్యల్లో విస్తృత వినియోగాన్ని అందిస్తుంది. దీని తేలికపాటి డిజైన్, అలాగే 7.62 మిల్లీమీటర్ గుండు సామర్థ్యం కారణంగా బలమైన కవర్‌ను కూడా ఛేదించే శక్తి దీనికి ఉంది. దీంతో పట్టణ యుద్ధ పరిస్థితుల్లో, ముఖ్యమైన ఆపరేషన్లలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ వెలుతురు కూడా కచ్చితమైన లక్ష్య సాధన కోసం పికాటిన్నీ రైల్స్, ట్రిటియం నైట్ సైట్స్‌ను ఇందులో అమర్చారు. అయితే, నాటో ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఆయుధాలను రూపొందించారు. ఈ ఆయుధం దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా కంప్యూటరైజ్డ్ వెపన్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సౌకర్యం ఉండటం వల్ల ఎంత ఒత్తిడిలోనైనా లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు.
భారత్-ఇజ్రాయిల్ మధ్య రక్షణ రంగంలో పెరుగుతున్న డీల్స్
భారత్-ఇజ్రాయిల్ మధ్య రక్షణ రంగంలో భాగస్వామ్యం రోజురోజుకు విస్తరిస్తోంది. పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ఇప్పటికే 1,70,000 క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్ల సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో తొలి విడతగా 18,000 కార్బైన్లను ఈ ఏడాది సరఫరా చేయనుంది. గత సంవత్సరం నవంబర్‌లో భారత్, ఇజ్రాయిల్ దేశాలు రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఆధునిక సాంకేతికత పంచుకోవడం, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తికి మార్గం సుగమమైంది.
ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌లో పర్యటించిన మోడీ
భారత ప్రధాని మోడీ ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి టెక్నాలజీలలో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. భవిష్యత్ వ్యవసాయ అవసరాలను తీర్చగల కొత్త టెక్నాలజీలనూ సంయుక్తంగా అభివృద్ధి చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. భారత్, ఇజ్రాయిల్‌లలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను క్రియేట్ చేయడంపైనా ఫోకస్ పెడతామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగం లోనూ ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయని అన్నారు.



