Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమీ పనితీరేం బాగాలేదు

మీ పనితీరేం బాగాలేదు

- Advertisement -

పడిపోతున్న ట్రంప్‌ ఆమోద రేటింగ్‌
93 నుంచి 97 శాతం ‘చెడు ప్రచారం’
మీడియాపై ట్రంప్‌ మండిపాటు

వాషింగ్టన్‌ : ఇరాన్‌తో యుద్ధం మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు మధ్యప్రాచ్యంలో జరిగిన అమెరికా చర్యలను మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సీఎన్‌ఎన్‌ బుధవారం నివేదించింది. దీంతో ట్రంప్‌ మొదటి పదవీకాలం నుంచి ఆయన ఆమోద రేటింగ్‌లు ప్రజా అభిప్రాయ సేకరణలో గణనీయంగా పడిపోయాయి. తనపై వస్తున్న 93 నుంచి 97 శాతం ‘చెడు ప్రచారం’కు ‘నకిలీ మీడియా’నే కారణమని భావించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రతికూల ప్రచారానికి తన ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ను నిందిస్తూ, ”మీరు చాలా దారుణంగా పని చేస్తున్నారు” అని ట్రంప్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

వైట్‌ హౌస్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రెస్‌ సెక్రెటరీ లీవిట్‌పై చేసిన ఈ వ్యాఖ్యను ఒక జోక్‌గా భావించారు. ట్రంప్‌ విలేకరులతో మాట్లాడేటప్పుడు లీవిట్‌ గురించి తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో కాస్త గందరగోళంగా ఉన్న సమయంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘నేను పట్టుకోవడానికి ఏదైనా వెతుకుతున్నాను. అది కరోలిన్‌ కాదు’ అని అన్నారు. న్యూ యార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ తన గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, అమెరికన్‌ మీడియాపై చేస్తున్న విస్తత విమర్శలో భాగంగానే లీవిట్‌పై ట్రంప్‌ ఈ వ్యాఖ్య చేశారు.
తన వరుస ఎన్నికల విజయాలకు, తనపై వస్తున్న తీవ్రమైన ప్రతికూల ప్రచారం ఎలా విరుద్ధంగా ఉందో వివరిస్తూ ట్రంప్‌ ఇలా అన్నారు, ”మనం మన మీడియాను సరిదిద్దుకోవాలి… నిజాయితీగా లేని పత్రికలను సరిచేయాలి. ప్రజలు మీడియాను నమ్మడం లేదు.”

అభిప్రాయ సేకరణలలో, ట్రంప్‌ మొదటి పదవీకాలం నుంచి ఆయన ఆమోద రేటింగ్‌లు గణనీయంగా పడిపోయాయి. ఇరాన్‌తో యుద్ధం మొదలై ఒక నెల గడిచిన తర్వాత, మధ్యప్రాచ్యంలో అమెరికా చర్యలను మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సీఎన్‌ఎన్‌ నివేదించింది. ఇరాన్‌లోని పరిస్థితిని చక్కదిద్దడానికి ట్రంప్‌నకు స్పష్టమైన ప్రణాళిక ఉందని 67 శాతం మంది అమెరికన్లు నమ్మడం లేదని కూడా ఆ నివేదిక చూపిస్తుంది. ఫిబ్రవరి నుంచి ఈ సంఖ్య ఏడు శాతం పెరిగింది. ఇరాన్‌ పరిస్థితిని చక్కదిద్దడంలో ట్రంప్‌ ఆమోద రేటింగ్‌ 33 శాతంగా ఉందని, ఇది ఆయన మొత్తం 35 శాతం, విదేశాంగ విధానంపై 36 శాతం రేటింగ్‌ కంటే కొంచెం తక్కువగా ఉందని నివేదించింది. అయితే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ట్రంప్‌ స్వయంకతాపధమని వైట్‌ హౌస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -