Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించని పీసీబీ

ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించని పీసీబీ

- Advertisement -

అధికారులపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరిగ్గా స్పందించలేదు. జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను లెదర్‌ పార్క్‌ భూముల్లో అక్రమంగా పారబోస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంపై రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల ఫిర్యాదులకే స్పందించని అధికారులు సామాన్య ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎలాంటి పరిశ్రమల వ్యర్థాలపైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వ్యర్థాల నిర్వహణ పరిస్థితిపై సమీక్షించాలని నిర్ణయించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి అన్ని జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఆ సమావేశంలో రెడ్‌ జోన్‌ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు, పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -