Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందక్షిణ మధ్య రైల్వేకు రూ.21,211.92 కోట్ల ఆదాయం

దక్షిణ మధ్య రైల్వేకు రూ.21,211.92 కోట్ల ఆదాయం

- Advertisement -

జోన్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి రాబడి
సరుకు రవాణాతో రూ.13,835 కోట్లు
ప్రయాణికులతో రూ.6,235 కోట్ల ఆదాయం : దక్షిణ మధ్య రైల్వే జీఎం ఎస్‌.కె శ్రీవాస్తవ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్‌)జోన్‌ చరిత్రలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆధిక ఆదాయం నమోదైనట్టు జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీఆర్‌కు మొత్తం రూ.21,211.92 కోట్ల స్థూల ఆదాయం సమకూరినట్టు ప్రకటించారు. ఇందులో సరుకు రవాణా ద్వారా రూ.13,835.27 కోట్లు, ప్రయాణికుల ద్వారా రూ.6,235.37 కోట్లు, మిగతాది ఇతర మార్గాల ద్వారా సమకూరినట్టు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి 3.12 శాతం వద్ధి నమోదు చేసినట్టు తెలియజేశారు. గురువారం రైల్‌నిలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ ఏడాది అన్నీ విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనపరిచినట్టు చెప్పారు.

జోన్‌ పరిధిలో రైల్వేల ద్వారా 286.44 మిలియన్ల ప్రయాణీకులను రవాణా చేసినట్టు తెలియజేశారు. జోన్‌కు గతంలో రూ.11,012 కోట్లు బడ్జెట్‌ గ్రాంట్‌గా ఇవ్వగా, ఈసారీ రూ.13,020 కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 147,871 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసినట్టు చెప్పారు. తద్వారా రూ.13,575 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 2024-25లో రూ.13,535 కోట్లు నమోదైందని ప్రకటించారు. 38.04 మిలియన్‌ టన్నుల సిమెంట్‌, 19.83 మిలియన్‌ టన్నులు, 8.82 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ద్వారా ఆదాయం వచ్చిందని వివరించారు.ఈ జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయాణీలకు విభాగంలో రూ.6235.37 కోట్ల ఆదాయం రావడం ఇదే ప్రథమమని చెప్పారు. గతంలో 3,495 రైళ్లతో పొలిస్తే ఈసారి 3,791 ప్రత్యేక రైళ్లను నడిపినట్టు పేర్కొన్నారు. టికెట్ల తనిఖీ ద్వారా రూ.232.6 కోట్ల ఆదాయం సమకూరినట్టు వివరించారు. జోన్‌ పరిధిలో 194.57 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ వేసినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -