Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'మోడల్‌' ఉపాధ్యాయుల సేవా రికార్డులు రక్షించేలా చర్యలు తీసుకోవాలి

‘మోడల్‌’ ఉపాధ్యాయుల సేవా రికార్డులు రక్షించేలా చర్యలు తీసుకోవాలి

- Advertisement -

డీఎస్‌ఈ కమిషనర్‌కు పీఎంటీఏ టీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

టీపీఎస్‌లో విలీనం చేస్తున్న మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సేవా రికార్డులు, సీనియారిటీ, జీతభత్యాలు రక్షించబడేలా చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (పీఎంటీఏ టీఎస్‌) కోరింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్‌ అధ్యక్షులు తరాల జగదీష్‌, ప్రధాన కార్యదర్శి అప్పాల అశోక్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. వారి సేవా హక్కులు, క్యాడర్‌ విధానం, భవిష్యత్‌ ప్రమోషన్‌ మార్గాలపై స్పష్టతనివ్వాలని కోరారు. టీపీఎస్‌ ఏర్పాటు మంచి నిర్ణయమని స్వాగతించారు. పారదర్శకమైన ప్రమోషన్‌ విధానాన్ని రూపొందించాలనీ, క్యాడర్‌ ప్రోటోకాల్‌, బదిలీలు, పోస్టింగ్‌ విధానాలను న్యాయబద్ధంగా ముందస్తుగా అమలు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పులగం దామోదర్‌ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -